ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఆమె సీఎం జగన్‌కు పంపారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తనకు కానీ తనక భర్తకు కానీ పోటీ చేసే అవకాశం కల్పించాలన్న అభ్యర్థనను వైసీపీ మన్నించలేదనే మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో పదవికి రాజీనామా చేశారు. పార్టీలో కార్యకర్తగానే పని చేస్తానని వాసిరెడ్డి పద్మ లేఖలో పేర్కొన్నారు. ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్లల ఒకరుగా పేరొందని ఆమె రాజమండ్రి, నందిగామ, జగ్గయ్యపేటల్లో.. ఎక్కడో ఒక చోటి నుంచి పోటీ చేయాలనుకున్నారట. కాగా, కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఆమె 2009లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.