ప్రతి పక్షం, దుబ్బాక, ఏప్రిల్10 : ఎవరెన్ని కుట్రలు చేసినా మెదక్‌లో ఎగిరేది బీజేపీ జెండానే అని రఘునందనరావు ధీమా వ్యక్తంచేశారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో బుధవారం తన స్వంత గ్రామమైన బొప్పాపూర్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలపైన ప్రజలకు నమ్మకం పోయిందని, ఆ రెండు పార్టీలను ప్రజలను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు.
ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు గత ఎన్నికల్లో చిత్తు చిత్తు గా ఓడించి కనుమరుగు చేశారన్నారు. ఆరు గ్యారంటీల హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ నేటి వరకు ఇచ్చిన హామీలను సంపూర్ణంగా నెరవేర్చలేక ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని విమర్శించారు. మెదక్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మీ రఘునందన్ రావు ను భారీ మెజారిటీతో గెలిపిస్తే ప్రజల గొంతుకనవుతానన్నారు.