బీజే ఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
నిర్మల్ కూరగాయల మార్కెట్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారం
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 3 : అందరి ఆధారాభిమానాలతో మూడవసారి కూడా నరేంద్ర మోడీ ప్రధాని కాబోతున్నారని బీజేపీ నేత నిర్మల్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆశాభవం వ్యక్తంచేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ ప్రధాన కోరగాల మార్కెట్లో శుక్రవారం ఉదయం పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ఎంపీ అభ్యర్థి గోడెం నగేష్ తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ కేంద్రంలో పదేళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కార్యక్రమాలకు వివరిస్తూ సుస్థిర పాలన తీరును గమనించి మూడోసారి కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడేలా అన్ని వర్గాల ప్రజలు సహకరిస్తున్నారని చెప్పారు.
హిందూ సనాతన ధర్మ పరిరక్షణతో పాటు దేశంలోని అన్ని వర్గాలకు సమన్యాయం సమసంక్షేమం ఒక బీజేపీతోనే సాధ్యం అన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో పత్రాలను పంపిణీ చేశారు. వీరితోపాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి ,సీనియర్ నాయకులు వి సతనారాయణ గౌడ్ ,పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిలు సామా రాజేశ్వర్ రెడ్డి, మెడిసెమ్మ రాజు, బీజేపీ పెద్ద పెల్లి ఇన్చార్జ్ రావుల రాంనాథ్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు సాధం అరవింద్, మున్సిపల్ హైట్రిక్ కౌన్సిలర్ అయ్యన్న గారి రాజేందర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్ ,సీనియర్ నాయకులు శ్రీనివాస్, బీజేపీ, బీజేవైఎం ఆయా విభాగాల పదాధికారులు, నాయకులు పాల్గొన్నారు.