Trending Now

మంత్రి సీతక్కపై బీజేపీ నేత ఫైర్..

బీజేపీ నేత, నిర్మల్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 13 : మంత్రి సీతక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అడ్డగుపెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బీజేపీ నేత, నిర్మల్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఉదయం నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాజులపేట ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్ తన ఓటు హక్కును కుటుంబ సమేతంగా వెళ్లి వినియోగించుకున్నారు. రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క, కాంగ్రెస్ శ్రేణులు ధర్మాన్ని ఓడించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఓటర్లు అడ్డుకొని ధర్మం పక్షాన నిలబడి నిర్మల్ లో 50 వేల పైచిలుకు ఓట్లతో భారతీయ జనతా పార్టీ అదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గోడం నాగేష్ ను గెలిపిస్తున్నారని బీజేపీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

అదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం లో ఎంపీ అభ్యర్థి అత్యధిక ఓట్లతో గెలవబోతున్నారని చెప్పారు. అధికార దుర్వినియోగంతో డబ్బులు, మద్యం పంపిణీ చేసినా ఓటర్లు మాత్రం వారికి తగిన విధంగా బీజేపీకి భారీ ఓట్లు వేసి తగిన గుణపాఠం చెబుతారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి మీద యుద్ధం చేసేందుకు ఎన్నికలు ఎంతగానో దుహదపడతాయని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Spread the love

Related News