ప్రతిపక్షం, సిద్దిపేట, మే 1: బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం కోసం బుధవారం పట్టణ ఎన్నికల ప్రచార కో కన్వీనర్ తొడుపునూరి వెంకటేశం ఆధ్వర్యంలో నాయకులు సిద్దిపేట పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 12, 13, 14వ వార్డుల్లో ప్రజలను కలుస్తూ బీజేపీ పాలన, మోడీ నాయకత్వంలో ముందుకు పోతున్న దేశం గురించి వివరిస్తూ బీజేపీ ని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా తొడుపునూరి వెంకటేశం మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ లు ఒక్కటేనని అన్నారు. ఈ రెండు పార్టీలు అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటేనే దేశం మోడీ పాలనలో భద్రంగా ఉంటుందన్నారు. మోడీ మూడోసారి ప్రధానిగా ఖాయం అన్నారు.
ఓటు వేసి ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోడూరు నరేష్, బీజేపీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి బొమ్మగోని పద్మ, పట్టణ ప్రధాన కార్యదర్శులు కేమ్మసారం సంతోష్ కుమార్, బొడ్డు సునీల్, పిట్ల నరేష్, మాజీ కౌన్సిలర్ బాసంగారి వెంకట్, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు పుల్లయ్య గారి వెంకట్ గౌడ్, చెంది సత్యనారాయణ, గుండం లక్ష్మారెడ్డి, ఎలుక ఎల్లం, బీజేవైఎం సిద్దిపేట జిల్లా అధ్యక్షలు నీలం దినేష్, బీజేపీ పట్టణ కార్యదర్శులు కాసనగొట్టు సంతోష్ కుమార్, గరిపల్లి సాయి బాబా, పట్టణ అధికార ప్రతినిధి మెరుగు ఎల్లం గౌడ్, రాపల్లి శ్రీనివాస్, ముద్దం రాజిరెడ్డి, కొండూరి మహేష్, హర్షవర్ధన్ రెడ్డి, సంజయ్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.