Trending Now

కాంగ్రెస్ వైఫల్యాలే ప్రచార అస్త్రాలు..

నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్ రెడ్డి..

ప్రతిపక్షం, నిర్మల్ ప్రతినిధి: బీజేపీ మైక్రో డొనేషన్ కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ వైఫల్యాలే ప్రచార అస్త్రాలు అవుతున్నాయన్నారు. కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామన్న భావన ప్రజల్లో ఉందని.. ప్రస్తుతం ఉన్న పరిణామాలను అనుకూలంగా మలుచుకోవాలని సూచించారు. అలాగే సభలు, సమావేశాల కంటే ప్రతి ఇంటికీ వెళ్లి ప్రధాని మోదీ పథకాలతో పొందుతున్న ప్రయోజనాలను వివరించాలని సూచించారు.

అదిలాబాద్ పార్లమెంట్ ను భారీ మెజార్టీతో కైవసం చేసుకునే లక్ష్యంతో నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్న బూత్ లెవల్ కో ఆర్డినేషన్, కొత్త, పాత నేతల మధ్య సమన్వయం పెంపొందించడంపై ఫోకస్‌ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య, పెద్దపెల్లి జిల్లా ఇంచార్జ్ రావుల రామనాథ్, మైక్రో డొనేషన్స్ అదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ సామ రాజేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమే రాజు, మైక్రో డొనేషన్స్ నిర్మల్ అసెంబ్లీ కన్వీనర్ కోరిపల్లి శ్రావణ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కమల్ నాయన్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News