ప్రతిపక్షం, రాజన్న సిరిసిల్ల: కేంద్రంలో అధికారంలోకి వస్తే మహిళలకు ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటున్న కాంగ్రెస్ మొదట, లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థుల్లో సగం కేటాయించాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ సవాల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం.. మహాలక్ష్మీ పథకం కింద ఒక్కో మహిళ ఖాతాలో నెలనెలా రూ.2,500లు జమ చేస్తామన్న హామీని విస్మరించిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలో గురువారం జరిగిన ప్రజాహిత యాత్రలో ఈ కామెంట్స్ చేశారు. ఆరు గ్యారంటీల ఎన్నికల హామీలే అమలుకానప్పుడు, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ అదనపు వాగ్దానాలు చేయడం హాస్యాస్పదమని సంజయ్ అన్నారు.