Trending Now

భాజపా ప్రచార రథాలకు ప్రత్యేక పూజలు..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 22 : అదిలాబాద్ ప్రచారానికి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ శ్రీకారం చుట్టారు. అదిలాబాద్ పట్టణంలోని దుర్గానగర్ కాలనీలోని దుర్గాదేవి ఆలయం వద్ద సోమవారం ప్రచార వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, వాహనాలను ప్రారంభించారు. అనంతరం దుర్గాదేవి సన్నిధిలో బీఫాం తో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి గోడల నగేష్ మాట్లాడుతూ.. మూడవసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావడం ఖాయం, పదేళ్ల పాలనలో ఎలాంటి అవినీతి అక్రమాలు లేని సుస్థిర పాలనను అందించిన ఘనత దేశ చరిత్రలో ఒక మోడీకే దక్కిందని చెప్పారు. భారతదేశంలో హిందూ సనాతన ధర్మ పరిరక్షణకు ప్రజాస్వామ్య బద్దంగా ప్రధాని నరేంద్ర మోడీ అందించిన పాలన మహోన్నతమైనదని చెప్పారు.

అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కుకు అధినేత కేసీఆర్ శాసనసభ ఎన్నికలలో టికెట్ ఇవ్వకుండా పక్కకు పెట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం మరిచి ఈ ఎన్నికలలోకి వచ్చి తిరిగి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేయడం దారుణం అన్నారు. ఈ కార్యక్రమంలో అదిలాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షులు పతాంగే బ్రహ్మానంద్, మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్, పార్లమెంట్ కో ఇంచార్జ్ అశోక్ ముస్తాపురే, పార్లమెంట్ కో కన్వీనర్ మయుర్ చంద్ర, బీజేపీ పట్టణ అధ్యక్షులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News