నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 15 : బోథ్ మండలంలోని మారుమూల గ్రామాలలో బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ సుడిగాలి పర్యటన చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో మహదుగూడ, జైతుగూడ, లేండిగుడ, వజ్జర్, చింతల్ బోరి, సంపత్ నాయక్ తాండ గ్రామాలలో పర్యటించి ముమ్మర ప్రచారం నిర్వహించారు. బీజేపీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలలో తీసుకెళ్తూ ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, మీ ప్రతినిధిగా పార్లమెంట్ కు పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.