పెద్దపల్లి ఇంచార్జ్ రావుల రాంనాథ్..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 29 : పదేళ్లపాటు సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదంతో అన్ని వర్గాలకు సమన్యాయం సమసంక్షేమం పేరుతో సుస్థిర పాలన అందించిన ప్రధాని నరేంద్ర మోడీని మళ్లీ కేంద్రంలో అవకాశం కల్పించవలసిన బాధ్యత మన అందరిపై ఉందని బీజేపీ పెద్దపల్లి ఇంచార్జ్ రావుల రాం నాథ్ పేర్కొన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని లోకల్ వెల్మల్ గ్రామాలలో లోకసభ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పదేళ్లలో ఎక్కడ కూడా ఎలాంటి అవినీతి అక్రమాలు లేని సుస్థిర పాలన అందించిన ఘనత దేశ చరిత్రలోనే మోడీకి దక్కిందని చెప్పారు.
హిందూ సనాతన ధర్మ పరిరక్షణ తోపాటు భవిష్యత్తులో దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లే సత్తా సామర్థ్యం ఒక ప్రధాని మోడీకే ఉందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లో కుమ్మక్కై ప్రజలను మోసగించే హామీలు మోయలేని రీతిలో మాటల ద్వారా మోపుతున్నాయని ఎద్దేవా చేశారు. పదేళ్ల బీజేపీ పాలనలో దేశంలో ఎక్కడా కూడా ఉగ్రవాదుల దాడులు ,మారణ హోమాలు జరగలేదని కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమమే ద్యేయంగా ప్రధాని నరేంద్ర మోడీ ముందుకెళ్లారని గుర్తు చేశారు. ఎంపీపీ సమత హరీష్ రెడ్డి, బీజేపీ నాయకులు, మార గంగారెడ్డి, బీజేపీ ఆయా విభాగాల పదాధికారులు, నాయకులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.