హుస్నాబాద్, ప్రతిపక్షం, ఏప్రిల్ 25 : బీజేపీ పార్టీ నుండి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి సంజయ్ గురువారం రోజున నామినేషన్ కార్యక్రమంలో పాలుగోనేందుకు హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాల బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్బంగా పట్టణ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కరీంనగర్ కి బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్బంగా మార్గమధ్యలొ కొత్తపల్లి హనుమాన్ దేవాలయం వద్ద టౌన్ ఇంచార్జి బూంరెడ్డితో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తగరం లక్ష్మణ్, రాంప్రసాద్, అనంతస్వామి, ప్రశాంత్, అరుణ్, సాయి, శ్రీనివాస చారి, సంతోష్, పుదారి శ్రీనివాస్ రాజేష్ తో కలిసి బండి సంజయ్ గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కరీంనగర్ కి తరలి వెళ్లారు. చిగురుమామిడి మండలంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. దేశానికి మోడీ నాయకత్వం మళ్లీ అవసరం ఉందని మోడీ ప్రధాని కావాలని దేశ భవిష్యత్తు మోడీ చేతుల్లోనే ఉందని అన్నారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా బీజేపీ అభ్యర్థి బంది సంజయ్ గెలిపించాలని ప్రజలను కోరారు.