ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి..
ప్రతిపక్షం, దుబ్బాక, మే 2: పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెదక్ పార్లమెంటు అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ని ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. గురువారం దుబ్బాక మున్సిపాలిటీలోని రేకులకుంట శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి తరఫున ప్రచారాన్ని ప్రారంభించి మాట్లాడారు. తను ప్రతి ఎలక్షన్లలో ఇక్కడ ఆలయంలో కొబ్బరికాయ కొట్టి ప్రచారాన్ని ప్రారంభిస్తానని, ఈ ఆలయం తనకు అన్ని విధాలుగా అచ్చివచ్చిన ఆలయం అని తెలిపారు. అనంతరం దుబ్బాక మండలం రాజక్క పేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాజక్కపేట తనకు అసెంబ్లీ ఎలక్షన్లో భారీ మెజారిటీ ఇచ్చిందని, ఈ ఎంపీ ఎలక్షన్లో కూడా భారీ మెజార్టీ ఇవ్వాలని కోరడం జరిగింది. మెదక్ ఎంపీ ఎలక్షన్లో ఇతర పార్టీ అభ్యర్థులు చెప్పే అబద్ధపు హామీలను ప్రజలు నమ్మవద్దని కోరారు. ఖచ్చితంగా మెదక్ ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని, ఈ దుబ్బాక నియోజకవర్గం మిగతా నియోజకవర్గాల కంటే ఎక్కువ మెజారిటీ ఇస్తుందని తెలియజేశారు.
మల్లన్న సాగర్ కాలవల ద్వారా రాజక్క పేటకు పంట పొలాలకు నీరు అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ దే అని, కాంగ్రెస్ పాలన పూర్తిగా విఫలమైందని, బీజేపీ నాయకులు చెప్పే అబద్ధపు హామీలను అస్సలు నమ్మవద్దని, ఎంపీ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి 100 కోట్ల తో ట్రస్ట్ పెట్టి సేవ చేయడానికి ముందుకు వచ్చారని వారిని ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గన్నె వనిత భూమి రెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కోమటి రెడ్డి వెంకట నరసింహారెడ్డి, కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి, కత్తి కార్తిక, బీఆర్‌ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు పల్లె వంశీ కృష్ణ గౌడ్, ఎంపీటీసీ రాధ మనోహర్ రెడ్డి, కౌన్సిలర్ లు ఆస యాదగిరి, నిమ్మ రజిత, దేవుని లలిత, నాయకులు పర్వతాలు, ఛాట్ల లత, గంట్యాల వీణ తది తరులు పాల్గొన్నారు.