Trending Now

బెంగుళూరులో బాంబు బ్లాస్ట్​.. ఉలిక్కిపడ్డ హైదరాబాద్

నగరంలో​ హై అలెర్ట్​..

పలు చోట్ల ముమ్మర తనిఖీలు..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: ఆర్థిక రాజధాని బెంగుళూరులో బాంబు పేలుళ్లతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్​ మహానగరంలో హై అలెర్ట్​ అయ్యారు. దేశంలో ఎక్కడైనా బాంబులు పేలుళ్లు సంభవించినప్పుడల్లా హైదరాబాద్​ నగరం అప్రమత్తత అవడం సహజంగా వస్తోంది. గతంలో హైదరాబాద్​లో వరుస బాంబు పేలుళ్లు సంభవించడం అందులో పదిమందికిపైగా మృతిచెందడం, పలువురు గాయపడడం తెలిసిందే. అయితే హైదరాబాద్​ నగరం పాకిస్తాన్​ ప్రేరేపిత ఉగ్రవాదులకు అడ్డగా మారిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

దేశంలో ఏ రాష్ట్రంలోనైనా తీవ్రవాదులు పట్టుబడితే హైదరాబాద్​లో మకాం వేసినట్లు నిఘావర్గాల విచారణలో స్పష్టమవుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్థరాత్రి బెంగుళూరు పేలుడుతో హైదరాబాద్‌లో పోలీసులు అప్రమత్తమయ్యారు. అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించారు. అక్కడ బాంబు పేలుళ్లలో హైదరాబాద్​కు చెందిన ఎవరికైనా సంబంధం ఉందా అన్న కోణంలో పోలుసులు విచారణ చేపట్టారు. గతంలో ఉగ్రవాదులు, వారికి ఆశ్రయం ఇచ్చిన పాతబస్తీ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలు జరుపుతున్న వారిని తనిఖీలు చేస్తున్నారు.

Spread the love

Related News

Latest News