మూడు రౌండ్ల కాల్పులు జరిపిన డీసీపీ చైతన్య
గాయపడ్డ దొంగలు.. ఆస్పత్రికి తరలింపు
ప్రతిపక్షం, హైదరబాద్ : హైదరాబాద్లో సౌత్‌ఈస్ట్ డీసీపీ చైతన్యపై దొంగలు దాడికి యత్నించారు. చాదర్ఘాట్పోలీస్స్టేషన్పరిధిలో ఓ సెల్ఫోన్దొంగను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆ దొంగలు పోలీసులపైనే దాడికి పాల్పడ్డారు. కాగా ఈ దాడిలో దొంగలు సౌత్‌ఈస్ట్ డీసీపీ చైతన్యపై కత్తితో దాడికి తెగబడ్డారు. దీంతో తేరుకున్న డీసీపీ వెంటనే వారిపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దొంగలను పట్టుకునే క్రమంలో గన్మెన్కిందపడిపోగా వెంటనే అతడి దగ్గర నుంచి గన్ తీసుకున్న డీసీపీ చైతన్య నిందితులు తప్పించుకోకుండా వారిపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సదరు దొంగలు గాయపడ్డారు. వెంటనే గాయపడ్డ వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





























