ప్రతిపక్షం, ఏపీ: డీఎస్సీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఎస్జీటీ పోస్టుల పరీక్షకు బీఈడీ అభ్యర్థులను అనుమతించమని న్యాయస్థానం ముందు ప్రభుత్వం తరపున లాయర్ తమ వాదనను వినిపించారు. దీంతో విచారణను ఎనిమిది వారాల పాటు వాయిదా వేస్తూ.. హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఎస్టీజీ పోస్టుల భర్తీలో బీఈడీ అభ్యర్థులను అనుమంతిచే విషయంలో హైకోర్టు స్టే ఇచ్చింది. కాగా, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఇందులో బీఈడీ అభ్యర్థులు కూడా ఎస్జీటీ పోస్టులకు అర్హులేనని ప్రకటించడంతో కోర్టును ఆశ్రయించారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను ఎలా అనుమతిస్తారంటూ కొందరు పిటీషన్ వేయడంతో దీనిపై విచారించిన హైకోర్టు దానిపై స్టే ఇచ్చింది. తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.