సిఐ సాక్షిగా
బిఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకుల దాడి
పోలీస్ స్టేషన్ ఎదుట
బిఆర్ఎస్ శ్రేణులు ధర్నా
ప్రతిపక్షం ప్రతినిధి,హనుమకొండ, మే 13, హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగరం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ నాయకులపై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ దాడి పరకాల సిఐ రవిరాజా సమక్షంలోనే జరిగినట్లు గ్రామస్తులు తెలుపడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే ప్రత్యక్ష సాక్షులు కథనం ప్రకారం పల్లెబోయిన సరోజ ఇంటి వద్ద కూర్చున్న బి ఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో కాంగ్రెస్ నాయకులు కర్రలతో వచ్చి అన్యంగా బిఆర్ఎస్ నాయకులకులపై దాడికి దిగినట్లు సమాచారం. ఈ దాడిలో చిట్టి రెడ్డి రత్నాకర్ రెడ్డి, ఏడుకొండ శ్రీనివాస్ లు గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
పరకాల లో ఉద్రిక్తత
నాగరం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ నేతలపై దాడికి దిగిన నేపథ్యంలో పరకాలలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
భారీ ఎత్తున తరలివచ్చిన బిఆర్ఎస్ శ్రేణులు పరకాల పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి, పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐ రవి రాజా వచ్చి ఆందోళకారులతో చర్చించి ఫిర్యాదిస్తే కేసు నమోదు చేస్తాం అన్నప్పటికీ మీసంలో దాడి జరిగినప్పుడు మీరు పట్టించుకోలేదు, సిపి వచ్చేవరకు ఆందోళన విరమించేది లేదంటూ బీస్మించుకున్నారు. దీంతో మాజీ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పోలీస్ స్టేషన్ కు చేరుకొని గాయపడ్డ బాధితులను ప్రమర్శించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో దాడికి పాల్పడ్డ వారిపై బాధితులతో ఫిర్యాదు చేయించడం గమనార్హం.