దొడ్డు వడ్లకు కూడా రూ. 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 21 : నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలంలో మంగళవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బీఆర్‌ఎస్ నిర్మల్ జిల్లా సమన్వయకర్త కొరిపల్లి రాంకిషన్ రెడ్డి ఆధ్వర్యంలో దిలావర్ పూర్‌లో దొడ్డు వడ్లకు కూడా రూ. 500 రూపాయిల బొనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. వడ్ల్ల కళ్ళలా వద్ద రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు మారుగొండ రాము, జడ్పీ కోఆప్షన్ సభ్యులు డా.యు. సుభాష్ రావు, చిన్న రెడ్డి, మహమ్మద్ నజీరొద్దిన్, సుధాన్, గంగారెడ్డి, సాయిరెడ్డి, కృష్ణ రెడ్డి, చంద్రశేఖర్ గౌడ్, సురేష్, అన్వర్ ,లక్ష్మణ చారి, నేల్ల అనిల్ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా జిల్లా సమన్వయకర్త రామకృష్ణారెడ్డి నిర్మల్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాములు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ రంగాన్ని అధోగతి పాలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు.
రైతన్నలకు ఇచ్చిన హామీలనుంటిని పక్కన అమలు చేయాలని లేనియెడల ఆందోళన కార్యక్రమాలను చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఎన్నికల అప్పుడు ఒక మాట.. ఎన్నికల అయిన తర్వాత ఒక మాటతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి రీతిలో ముందుకు వెళ్తున్నారని విమర్శించారు. మరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కనీస మౌలిక వసతులు లేక రైతులు నిత్యం పడరాన్ని పాట్లు పడుతున్నారని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను నేరవేర్చే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జోక్యం చేసుకొని ఆందోళనకారులను శాంతింప చేశారు.