Trending Now

మరో మూడు లోక్​సభల్లో బీఆర్ఎస్​ అభ్యర్థుల పెండింగ్..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: లోక్​సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో విపక్ష బీఆర్​ఎస్​పార్టీ ఇటు అధికార కాంగ్రెస్​తో పాటు బీజేపీ కన్న ముందుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి కొంత ఢీలా పడ్డప్పటికి లోక్​సభ ఎన్నికల్లో పార్టీని విజయతీరం వైపు తీసుకపోయేందుకు గులాబిబాస్, మాజీ సీఎం కేసీఆర్​ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. అయితే ముందుగ ఊహించిన అభ్యర్థులకు బదులుగా పార్టీకి కట్టుబడి ఉన్న వారిని లోక్​సభ బరిలోకి దించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పోటీపడ్డ పలువురు నేతలు (వ్యాపారులు) పార్టీ ఓడిపోయిన వెంటనే పోటీకి అనాసక్తి కనబరచడంతో పాటు అధికార పార్టీలోకి దూకేశారు. దీంతో నియోజకవర్గం ముఖ్యనేతల సమావేశాలు నిర్వహించి అందరి ఆమోధయోగ్యంతోనే గులాబిబాస్​ అభ్యర్థులను ఖరారు చేశారు.

ఇప్పటికి 14 నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించగా, హైదరాబాద్, నల్గొండ, భువనగిరి లోక్​సభ స్థానాల్లో గెలుపు వీరుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశం నిర్వహించి అభ్యర్థిని త్వరలో ఎంపిక చేయనున్నారు. ఇప్పటి వరకు ప్రకటించిన వారిలో ఖమ్మం : నామా నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ (ఎస్టీ ) : మాలోత్ కవిత, కరీంనగర్ : బోయినిపల్లి వినోద్ కుమార్ , పెద్దపల్లి(ఎస్ .సి ): -కొప్పుల ఈశ్వర్ , మహబూబ్ నగర్ : మన్నె శ్రీనివాస్ రెడ్డి , చేవెళ్ల : -కాసాని జ్ఞానేశ్వర్ , వరంగల్ (ఎస్ .సి): డాక్టర్ కడియం కావ్య , నిజామాబాద్ : బాజి రెడ్డి గోవర్ధన్ , జహీరాబాద్ : గాలి అనిల్ కుమార్ , ఆదిలాబాద్(ఎస్టీ ): ఆత్రం సక్కు , మల్కాజ్ గిరి : రాగిడి లక్ష్మా రెడ్డి , మెదక్ పి : వెంకట్రామి రెడ్డి , నాగర్ కర్నూల్ (ఎస్సీ ): ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్ , సికింద్రాబాద్ : తీగుళ్ల పద్మారావు గౌడ్ ఉన్నారు.

విస్తృత ప్రచారం..

లోక్​సభ ఎన్నికల్లో కనీసం మూడు, నాలుగింటిలో గెలుపొందాలని కేసీఆర్​ బావిస్తున్నారు. ఇందుకోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతీ పార్లమెంట్​ నియోజవర్గంలో కేసీఆర్​ బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలో పార్టీ నేతలు కేటీఆర్​, హరీశ్​రావులు రోడ్​షోలు నిర్వహించాలని నిర్ణయించారు. మూణ్ణెళ్లకు కాంగ్రెస్​పార్టీ భ్రష్టుపట్టిన పాలన, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల బాధుడుతో పాటు విపక్షాలపై అక్రమ కేసులు బనాయించడం తదితర అంశాలను ప్రచార అస్త్రాలుగా చేసుకొననున్నారు.

Spread the love

Related News

Latest News