Trending Now

బీజేపీని ఓడిద్దాం భారత రాజ్యాంగాన్ని రక్షిద్దాం..

బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ ఉద్యమ కవి గాయకులు మద్దెల నర్సింలు

ప్రతిపక్షం, సిద్దిపేట ప్రతినిధి ఏప్రిల్ 10: భారతదేశంలో ఉన్నటువంటి 85 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల హక్కులను బిజెపీ ప్రభుత్వం కాలరాసే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ఉద్యమ కవి గాయకులు మద్దెల నర్సింలు అన్నారు. అందుకే బీజేపీ పార్టీని ఓడిద్దాం భారత రాజ్యాంగాన్ని రక్షిద్దాం అని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని సవరణ పేరుతో మార్చే ప్రయత్నం చేస్తుందని, ఈ విషయాన్ని ప్రధానంగా బీసీ సామాజిక వర్గలు ఆలోచించాలన్నారు. నాటి లెక్కల ప్రకారం.. 15శాతం ఉన్న ఎస్సీ ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతదో దానికంటే రెట్టింపు అన్యాయం 65శాతం ఉన్న బీసీ కులాలకు జరగబోయే ప్రమాదం ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం మతపరమైన రాజకీయాలు చేస్తూ.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ.. ప్రధానంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందన్నారు.

రామ మందిర నిర్మాణానికి ఎవరు కూడా వ్యతిరేకత కాదు. కానీ మందిర నిర్మాణ పేరుతో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి పార్టీ ప్రచారాని పూర్తిగా తాము వ్యతిరేకిస్తున్నాం అన్నారు. అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంలోని డెమోక్రసీ మానవ స్వేచ్ఛని భారతీయుల హక్కులను తొలగించే ప్రయత్నం చేస్తూ మళ్లీ నాటి మను రాసిన మనుధర్మ శాస్త్రాన్ని నూతన రాజ్యాంగం పేరుతో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని ముక్తకంఠంతో భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు వ్యతిరేకించాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉందన్నారు. ఎందుకంటే 300 నుండి 350 వరకు బీజేపీకి సీట్లు వస్తే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే చట్టసభల్లో భారత రాజ్యాంగ పీఠాన్ని ఎత్తివేసే ప్రమాదం ఉందన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ప్రధాన బాధ్యత దళిత, ఎస్టి, బీసీ, మైనార్టీ ప్రజా సంఘాలు, మేధావులు కవులు అందరూ కలిసి ఈ మనువాద భావాలతో నిండిన బీజేపీని తరిమి కొట్టాల్సిన సమయం ఆసందమైందన్నారు. మెదక్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట రామ్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామన్నారు. కారు గుర్తుకు ఓటు వేద్దాం ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందామని అన్నారు.

Spread the love

Related News

Latest News