ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి బీఆర్‌ఎస్ ప్రతినిధులతో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎంఎల్‌సీ దండే విఠల్ వినతి పత్రం సమర్పించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని చెల్లించాలని, మద్దతు ధరకు అదనంగా క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ చెల్లింపు తదితర డిమాండ్లతో వినతి పత్రం సమర్పించారు. మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి గారు, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ శాసనసభ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదన చారి, ఎమ్మెల్సీలు దండే విఠల్, శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు ఉన్నారు.