Trending Now

నిందితులను తప్పించే పనిలో పడ్డ బీఆర్ఎస్ లీడర్లు..!

వీరన్నపేట గ్రామానికి చెందిన ఓ ఫేక్ రిజిస్ట్రేషన్ ఘటనలో

కేసు వెనక్కి తీసుకోవాలని బాధితులను ఒత్తిడి చేస్తున్న మధ్యవర్తిత్వం

మాకు ఇదేం కర్మ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు

ప్రతిపక్షం, షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లా జిల్లేడ్ చౌదరి గూడ మండలం వీరన్న పేట గ్రామానికి చెందిన గడ్డం వెంకటయ్య గత కొన్ని రోజుల క్రితం తాను బతికుండగానే చనిపోయినట్టు తప్పుడు పత్రాలు సృష్టించి తన పేరుగల 30 గుంటల భూమిని తహశీల్దార్, జంగయ్య, సహాయంతో ఇతరులకు విరసత్ చేసిన విషయం తెలిసిందే. అదే ఘటనలో బాధితులు జిల్లేడ్ చౌదరి గూడ మండల పోలీసులకు చెయ్యడంతో మార్చ్ 20 తేదీన 9 మందిని నిందితులుగా చేర్చి పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు మహిళలను రిమండ్ కు పంపారు. మిగతా పురుషులైన ఏడుగురిని రిమాండ్ చేయకపోవడం నియోజకవర్గ వ్యాప్తంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను తప్పించే పనిలో లీడర్లు ఉన్నట్టు బాధితులు చెప్పుకొస్తున్నారు. మాకు న్యాయం జరగక పోతే పోలీసు స్టేషన్ ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు. వేచి చూడాలి మరి పేద రైతు కుటుంబానికి న్యాయం జరుగుతుందా లేదా అధికారిని తప్పిస్తారా లేదా శిక్షిస్తార అనేది..

Spread the love

Related News

Latest News