ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో అరెస్ట్ అయిన కవితను రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 23వ తేదీ వరకు కవిత ఈడీ కస్టడీలో ఉండనున్నారు. ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ఆమెను కోర్టులో హాజరుపర్చాలని రౌస్ అవెన్యూ కోర్టు ఈడీని ఆదేశించింది. ప్రతి రోజు కుటుంబ సభ్యులు, ఆమె తరుఫు లాయర్లతో మాట్లాడేందుకు కవితకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది.