BRS MLC Kavitha Admit in Hospital: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనారోగ్యానికి గురయ్యారు. ఈ మేరకు ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఉదయం అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ మేరకు కవితకు సాయంత్రం వరకు పలు రకాల వైద్య పరీక్షలు చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. ఆమె గత కొంతకాలంగా గైనిక్ సమస్యలు, అధిక జ్వరంతో పాటు వివిధ రకాలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తీహార్ జైలులో ఉన్న సమయంలో ఎమ్మెల్సీ కవిత అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, తీహార్ జైలులో ఉన్న సమయంలో ఎమ్మెల్సీ కవిత అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. కాగా, కవిత గతంలోనే ఢిల్లీలోని ఎయిమ్స్ లోనూ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో భాగంగానే మరోసారి టెస్టులు చేయించుకొని ఏదైనా సమస్య ఉంటే ట్రీట్ మెంట్ తీసుకుంటారని తెలుస్తోంది.

 
								 
								 
															




























 
															