Trending Now

ప్రజాస్వామ్యం మనుగడే ప్రశ్నార్థంగా మార్చిన మోడీ..

బీఆర్ఎస్​ ఎంపీల మండిపాటు..

ప్రతిపక్షం, న్యూఢిల్లీ: లోక్​సభ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా విపక్షాలను ఇరుకున పెట్టేందుకు ప్రజాస్వామ్యానికి విరుద్దంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పాల్పడుతున్నదని బీఆర్​ఎస్​ పార్లమెంట్​పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్​రావు ఆరోపించారు. శుక్రవారం మధ్యాహ్నం రాజ్యసభ సభ్యుడు సురేశ్​రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీలు సురేశ్​రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వర్​రావు, మన్నెశ్రీనివాస్​రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేశ్వర్​రావు మాట్లాడుతూ రాజకీయ కక్షల లో భాగంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం విపక్షపార్టీలపై చేస్తున్న కుట్రలన్నీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇందులో బాగంగానే బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవితను ఆరెస్ట్​ చేయడాన్ని ఆయన ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో అప్రజాస్వామ్య సంఘటనలు చోటు చేసుకోవడం దేశ ప్రజలు గమనిస్తున్నారు. శివసేన పార్టీపై గతంలో బీజేపీ కుట్రలుచేసిందని ఆరోపించారు. బీజేపీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఒక్కొ రాష్ట్రంలో ఒక్కో వ్యూహాలను రూపొందిస్తున్నదని ఆరోపించారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పాలసీలను రూపొందిస్తారని, కేంద్ర ప్రభుత్వం కూడా అనేక పాలసీలు మార్చారన్నారు.ఓ మహిళ అని కూడా చూడకుండా కవితను అరెస్ట్ చేశారున్నారు. తెలంగాణ బిడ్డగా జరుగుతున్న పరిణామాలు చూసి రానున్న రోజుల్లో మా పార్టీకి మద్దతు ఇవ్వాలని యావత్​ దేశ ప్రజలను ఆయన కోరారు.

ఎన్నికలు జరుగుతుంటెనే రైడ్స్..

ఈడి రైడ్స్ అన్ని కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో రైడ్స్ చేశారని రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి తెలిపారు. రాజ్యసభ సభ్యుడుకానీ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా బీజేపీకి పార్టీకి లొంగని వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ మహిళా శక్తి అని రాద్దాంతం చేస్తున్నారు.అదే మోడీ అడబిడ్డను చీకటి పడ్డాక అరెస్ట్ చేసి తీసుకెళ్లారని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో అనేక ఒడిదుడుకులు వచ్చిన అధిగమించి తెలంగాణ రాష్ట్రం సాధించారని తెలిపారు. అవినీతి జరిగిందని అంటే ఆరోపణలు రుజువు చేయాలని, న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నమన్నారు. రెండేళ్లు సీరియల్స్ లాగా లాగదీసిన ఈ కేస్ ను ఇప్పుడు ఎన్నికల వేళ తెరపైకి తెచ్చారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. 2004 నుండి 2014 వరకు దేశ వ్యాప్తంగా 200 ఈడి కేసులుంటే, బీజీపీ అధికారంఓలకి వచ్చిన 2014 నుండి పది సంవత్సరాలు 2954 కేసుల సంఖ్య పెరిగిందని ఆరోపించారు. ఈ కేసు లో కవిత ఎప్పుడు బాధితురాలని, అయితే ఆమె నిందితురాలు అసలే కాదన్నారు. కోర్టు లపై నమ్మకము ఉంది.కడిగిన ముత్యం లాగా కవిత బయటకు వస్తుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దాడులను మూల్యం చెల్లించక తప్పదని ఎంపీ మన్నె శ్రీనివాస్​రెడ్డి హెచ్చరించారు. ఈడి,ఐటీ,సిబిఐ లను రిమోట్ కంట్రోల్ లాగా కేంద్ర ప్రభుత్వం వాడుకుంటూ ప్రభుత్వాలను కూల్చివేస్తున్నదని దుయ్యబట్టారు.

Spread the love

Related News

Latest News