Trending Now

బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల రాజీనామా..

నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్, 13 : నిర్మల్ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగుతున్నాయి. తాజాగా నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గా ఉన్న గండ్రత్ ఈశ్వర్ 15 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తూ.. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ కు లేఖ పంపినట్లు నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ శనివారం మధ్యాహ్నం ఆయన చాంబర్ లో ప్రకటించారు. నిర్మల్ పట్టణ అభివృద్ధి లక్ష్యంగా పలుమార్లు కౌన్సిలర్లతో చర్చలు జరిపిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

తనతో పాటు 10 నుంచి 15 మంది మున్సిపల్ కౌన్సిలర్లు కూడా మూడు, నాలుగు రోజులలో ఏ పార్టీలో చేరుతామో ప్రకటన చేస్తామని చెప్పారు. స్థానికంగా జరుగుతున్న రాజీనామా సమీకరణాలు పరిణామాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిర్మల్ పట్టణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మేమంతా ఏక నిర్ణయంతో బీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లు ఆయన ఈ సందర్భంగా వివరించారు.

Spread the love

Related News

Latest News