Trending Now

Jio: జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. 100GB ఉచిత స్టోరేజీ!

ఇటీవల మొబైల్ రీఛార్జ్ టారిఫ్‌లను భారీగా పెంచిన జియో.. తాజాగా తన యూజర్లకు ఓ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది దీపావళి నుంచి ఏఐ క్లౌడ్‌ స్టోరేజీ సేవలను ప్రారంభించనుంది. అంతేకాదు.. వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద తన యూజర్లకు 100 జీబీ ఉచిత స్టోరేజీని అందించనుంది. ఈ మేరకు అధినేత ముకేశ్‌ అంబానీ రియల్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ 47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక ప్రకటన చేశారు.

ఏఐ క్లౌడ్‌ స్టోరేజీతో యూజర్లు తమ ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్‌ వంటి డేటాను క్లౌడ్‌లో స్టోర్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే 100 జీబీ కంటే ఎక్కువ స్టోరేజ్‌ కావాలనుకునే వారు మాత్రం డబ్బులు చెల్లించి స్టోరేజ్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం గూగుల్ స్టోరేజ్‌ 100 జీబీ కోసం నెలకు రూ. 130 వసూలు చెస్తుండగా, యాపిల్‌ 50 జీబీకి రూ.75 వసూలు చేస్తుంది. అయితే జియో 100 జీబీ వరకు ఉచితంగా అందిస్తుండడంతో క్లౌడ్‌ స్టోరేజ్‌ సేవల్లో తీవ్రమైన పోటీ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది.

Spread the love

Related News