ప్రతిపక్షం, వెబ్ డెస్క్: పౌరసత్వ సవరణ చట్టం(CAA) అమలుపై ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం(MNM) పార్టీ చీఫ్ కమల్ హాసన్ (Kamal Haasan) మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల ముందు దేశాన్ని విభజించేందుకు CAA ని అమలు చేశారని కమల్ హాసన్ ఆరోపించారు. శ్రీలంక తమిళులను ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజల్ని విభజించి, సామరస్యాన్ని శాననం చేయడానికి ప్రయత్నిస్తోందని, రాబోయే ఎన్నికల్లో గెలవాలనే తపనతో, బీజేపీ హడావుడిగా CAA ని తెరపైకి తెచ్చిందని అన్నారు.