Trending Now

సీఏఏ రూల్స్ రాజ్యాంగ విరుద్ధం.. మమతా బెనర్జీ కీలక వాఖ్యలు

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: పౌరసత్వ సవరణ చట్టం–2019 (సీఏఏ)ను కేంద్రంలోని బీజేపీ సర్కారు నోటిఫై చేయడంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. సీఏఏ నిబంధనలు అస్పష్టంగా, రాజ్యాంగ విరుద్ధంగా, వివక్షాపూరితంగా ఉన్నాయని మండిపడ్డారు. నార్త్ 24 పరగణాల జిల్లాలోని హబ్రాలో మంగళవారం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సీఏఏ చట్టబద్ధతపై తనకు నమ్మకం లేదని అన్నారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) అమలుతో సీఏఏ ముడిపడి ఉన్నదని, ప్రజలను నిర్బంధ శిబిరాలకు తీసుకెళ్తారని, రాష్ట్రంలో సీఏఏ అమలును తాను అనుమతించబోనని తెగేసి చెప్పారు.

Spread the love

Related News

Latest News