పట్టించుకోని మార్కెట్ యార్డ్ సిబ్బంది..
ప్రతిపక్షం, హుస్నాబాద్, ఏప్రిల్ 13 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డ్ రైతులకు ఉపయోగపడే షెడ్యూల్ యందు కార్ల పార్కింగ్ చేస్తున్నారు. మార్కెట్ యార్డ్ సిబ్బంది నిర్లక్ష్యంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. రైతులు షెడ్డులో వడ్లు పోసుకుందామంటే షెడ్‌లో కార్లు పార్కింగ్ చేసి ఉన్నాయని మార్కెట్ సిబ్బంది తీరు చూస్తేనే వారి యొక్క పనితీరు తెలుస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. కూత వేటి దూరంగానే మంత్రి కార్యాలయం ఉండగా.. రైతులను పట్టించుకునే నాధుడే లేడని రైతులకు సరైన ప్రభుత్వ మద్దతు ధర పలకకుండా ప్రైవేట్ వ్యాపారాలు, ట్రేడర్లు ఇష్టానుసారంగా రోడ్లపైన కొనుగోలు చేస్తుంటే మంత్రిగా ఉండి ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే ట్రేడర్లపై వారికి సహకరిస్తున్న ప్రైవేటు సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంక్వయిరీ చేయించి చేసుకోవాలని రైతులు కోరారు.