ప్రతిపక్షం, మంథని, ఏప్రిల్ 15 : బీఎస్పీ పార్టీకి చల్లా నారాయణ రెడ్డి రాజీనామా చేశారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీలో చేరిన చల్లా నారాయణ రెడ్డి మంథని అసెంబ్లీ బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా, మరికొన్ని వ్యక్తిగత కారణాల వల్ల బీఎస్పీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్‌కి రాజీనమా లేఖను అందజేశారు. మంథని నియోజకవర్గ ప్రజలకు వెన్నంటే ఉండి, సదా మంథని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా చల్లా నారాయణ రెడ్డి పేర్కొన్నారు. తదుపరి కార్యాచరణ, భవిష్యత్ ప్రణాళిక త్వరలో ప్రకటిస్తాన్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో మంథని నియోజకవర్గం నుండి బీఎస్పీ పార్టీ తరఫున ఆయన పోటీ చేశారు.