Trending Now

ప్రైవేట్ ఫీజుల దోపిడీని అరికట్టాలి..

ఎస్ఎఫ్ఐ నిర్మల్ జిల్లా కార్యదర్శి చందాపూర్ దిగంబర్

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 23 : నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల, కళాశాలలో ఫీజులో దోపిడీని అరికట్టాలని ఎస్ఎఫ్ఐ నిర్మల్ జిల్లా కార్యదర్శి చందాపూర్ దిగంబర్ పేర్కొన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజులలో నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దిగంబర్ మాట్లాడుతూ.. జిల్లాలో అనుమతులు లేకుండా కొన్ని బడా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ముందస్తు అడ్మిషన్లు చేస్తూ అడ్మిషన్లు చేయడమే కాకుండా రిజిస్ట్రేషన్ ఫీజులు సైతం భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అదేవిధంగా ఫీజులు హద్దు లేకుండా మితిమీరి పెంచుతున్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫీజుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి జలగలాగా పట్టిపీడిస్తున్నారని, పేద విద్యార్థుల రక్తం తాగుతున్నారని ఆరోపించారు. అదేవిధంగా ఈ సంవత్సరం పూర్తి చేసిన పదో తరగతి విద్యార్థుల దగ్గర నుండి టీసీ, స్టడీ సర్టిఫికెట్, బోనఫైడ్ రూపంలో పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతోపాటు జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కీంలో సీట్లు పెంచాలని డిమాండ్ చేశారు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులకు 25% ఉచితంగా విద్యను అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సతీష్ పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News