law college in Amaravati: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయిం తీసుకుంది. ఈ మేరకు సోమవారం న్యాయశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఏపీ రాజధాని అమరావతిలో లా కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతోపాటు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. మంత్రివర్గ భేటీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామన్నారు.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఇంటర్నేషన్ లా స్కూల్ ఏర్పాటును ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. అలాగే జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు.జూనియర్ న్యాయవాదులకు శిక్షణ అకాడమీ ఏర్పాటుకు కార్యాచారణ సిద్ధం చేయాలని ఆదేశించారు.