ప్రతిపక్షం, స్పోర్ట్స్: రాజకీయ నేత కుమారుడి కోసం నన్ను కెప్టెన్సీ నుంచి తప్పించారని.. భవిష్యత్తులో ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడబోనని హనుమ విహారి పెట్టిన ఇన్ స్టా పోస్ట్ ఏపీ పాలిటిక్స్‌లో దుమారం రేపింది. ఇక, ఈ అంశంపై తాజాగా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ట్విట్టర్ (ఎక్స్)లో వేదికగా స్పందించారు. ‘వైఎస్సార్‌సీపీ ప్రతీకార రాజకీయాలకు ఆంధ్రా క్రికెట్ సంఘం కూడా లొంగిపోవడం సిగ్గుచేటు. హనుమవిహారి ఒక చురుకుగా ఆడే ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెటర్. అతను ఆంధ్రప్రదేశ్ తరఫున ఎన్నటికీ ఆడనని ప్రమాణం చేసే స్థాయికి టార్గెట్ చేయబడ్డాడు. హనుమ మీరు దృఢంగా ఉండండి. ఆట పట్ల మీ చిత్తశుద్ధి, నిబద్ధత వెలకట్టలేనిది. ఇలాంటి చర్యలు ఆంధ్రప్రదేశ్ లేదా మన ప్రజల నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబించవు. మేము మీకు అండగా ఉంటాము.. న్యాయం జరిగేలా చూస్తాము.’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.