ప్రతిపక్షం, టెక్నాలజీ: వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. తాజాగా వెబ్ వెర్షన్ వినియోగదారుల కోసం మరోక కొత్త ఆప్షన్‌ను కంపెనీ ప్రకటించింది. వెబ్ యూజర్లు తమ చాట్‌ను లాక్ చేసుకోవడానికి అనువుగా ఉండే ఫీచర్‌ను కంపెనీ త్వరలో తీసుకురానుంది తెలిపింది. దీనికి సంబంధించి ప్రస్తుతం టెస్టింగ్‌లు చేస్తుంది. చాట్‌లో మెసేజ్‌లను ఒక ప్రత్యేకమైన కోడ్ ద్వారా ఇతరులు దానిని చూడకుండా లాక్ చేసుకోవచ్చు. తిరిగి ఈ చాట్‌ను చూడాలంటే రహస్య కోడ్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ కోడ్ ఎమోజి, ప్రత్యేక అక్షరాలతో సహా ఒక పదంతో ఉండవచ్చు. ఈ ఫీచర్ ద్వారా యూజర్ల ల్యాప్‌టాప్/కంప్యూటర్లలో తమ వాట్సాప్ చాట్‌ను అవతలి వారు చూడకుండా లాక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం WhatsApp వెబ్ కొత్త వెర్షన్‌లో ఫీచర్ ట్రాకర్ WABetaInfo ద్వారా గుర్తించారు. ఈ ఫీచర్‌ను త్వరలో సాధారణ వెబ్ వినియోగదారులకు విడుదల చేయనున్నారు.