ప్రతిపక్షం, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకలు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హెచ్చరించారు. లక్షలాది విద్యార్థుల భవిష్యత్ తో ఆటలాడడాన్ని సహించబోమని స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ప్రశ్నపత్రాల లీక్ చేయడానికి ప్రయత్నించిన అధ్యాపకులు, సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు నిన్న కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పారు. ఇంటర్మీడియ్ పరీక్షలు తరువాత పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.