ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ‘కల్కి’పై మంచి రివ్యూస్ వస్తున్నాయంటూ చిత్ర బృందానికి నటుడు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా టీమ్‌ని అభినందించారు. అగ్ర నటులు అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొణెలతో మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కించడంపై దర్శకుడు నాగ్ అశ్విన్‌ను కొనియాడారు. అశ్వనీదత్‌ను తనకు ఇష్టమైన నిర్మాతగా పేర్కొంటూ ఆయన్ను, చిత్ర నిర్మాణంలో భాగమైన ఆయన కుమార్తెలు ప్రియాంక, స్వప్నలకు ప్రత్యేకంగా కంగ్రాట్స్ చెప్పారు.