ప్రతిపక్షం, దుబ్బాక మార్చి 28: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం అని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించు కావాలని దుబ్బాక సీఐ శ్రీనివాస్ అన్నారు. గురువారం లోకసభ ఎన్నికల సందర్భంగా దుబ్బాక ఎస్ఐ గంగరాజ్, మిర్ దొడ్డి ఎస్ఐ పర్శరాం, ఎస్ఐ రవికాంత్, కేంద్ర బలగాలు, కలిసి దుబ్బాక పట్టణంలో ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1950 కి కాల్ చేయాలని సూచించారు. భారత ఎన్నికల సంఘం నూతనంగా ప్రవేశ పెట్టిన సీ- విజల్ యాప్ ను మొబైల్ ఫోన్ నుండి డౌన్ లోడ్ చేసుకుని ఫోటోలు, వీడియోలు తీసి.. ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.