CM Chandrababu and Pawan Kalyan in Van Mahotsav Day: ప్రతి ఒక్కరూ ఏడాదికి రెండు మొక్కలు నాటాలని సీఎం చంద్రబాబు నాయకుడు పిలుపునిచ్చారు. మంగళగిరిలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వేప, రావి చెట్లను నాటారు. వనమహోత్సవం ఎంతో మహత్తరమైన కార్యక్రమమని, పచ్చదనం ఆవిశ్యకతను విద్యార్థులు గ్రహించాలన్నారు. ఈ కార్యక్రమం తనకు ఎంతో ఇష్టమని, రాష్ట్రంలో పచ్చదనం 50శాతానికి పెరగాలన్నారు.
చెట్లు నరకడం తేలికని, పెంచడమే కష్టమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. సహజ అందాలతో వచ్చే అనుభూతి ఎంతో సంతృప్తి ఇస్తొందని, చెట్లు పెంచడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు. కోటి మొక్కలు నాటే ప్రయత్నం చేస్తున్నామని, సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ కలిసి రావాలన్నారు. ప్రస్తుతం 29 శాతం ఉన్న పచ్చదనాన్ని 50 శాతానికి తీసుకెళ్లే దిశగా కృషి చేస్తున్నామని పవన్ తెలిపారు.