CM Chandrababu Announcement on Pensions: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రతి నెలా 1వ తేదీన పంపిణీ చేయనున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఈ నెలాఖరుకే అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆగస్టు 31వ తేదిన పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం రావడంతోపాటు ఆ రోజు ఉద్యోగులకు సెలవు దినం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వాలని ప్రభు్తవం నిర్ణయించుకుంది. ఒకవేళ ఆగస్టు 31న పెన్షన్లను తీసుకోని సమక్షంలో వారికి సెప్టెంబర్ 2న లబ్ధిదారులకు అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. కాగా, అంతకుముందు జరిగిన ఏపీ కేబినేట్ భేటీలో రివర్స్ టెండరింగ్ రద్దు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.