Trending Now

CM Chandrababu: సీఎం సహాయనిధికి రూ.400 కోట్లు హర్షణీయం.. చంద్రబాబు

CM Chandrababu Distributes Compensation To Vijayawada Flood Victims: సీఎం సహాయనిధికి రూ.400 కోట్లు రావడం ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. వరద సమయంలో అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లినట్లు, ప్రజలు భారీగా విరాళాలు ప్రకటించారన్నారు. నాతో పాటు ఉద్యోగులంతా 11 రోజుల పాటు నిర్విరామంగా పనిచేశారన్నారు. వరద నీటిలో బాధితులకు అన్నిరకాల సాయం అందించే ప్రయత్నం చేశామన్నారు. అధికార యంత్రాంగంతో పాటు నేను స్వయంగా బురదలో దిగానని, తక్కువ సమయంలో విపత్తు నుంచి బయటపడగలిగామన్నారు.

చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 42సెం.మీల వర్షం పడిందని, 16 జిల్లాలు ప్రభావితమయ్యాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి వరద బాధితులకు సహాయం అందించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు విజయవాడ వరదల బాధితులకు ఇళ్లు మునిగిన వారికి రూ.25 వేలు చొప్పున, మొదటి అంతస్తులో ఉన్న వారికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేశామని చంద్రబాబు తెలిపారు. వరద సమయంలో అందరం సమన్వయంతో పనిచేశామని, అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లామని చంద్రబాబు వెల్లడించారు. గత పాలకులు చేసిన పాపాలు శాపాలుగా మారాయని చంద్రబాబు విమర్శలు చేశారు.

Spread the love

Related News

Latest News