CM Chandrababu Inspects Prakasham Barrage: ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించారు. అనంతరం గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడుతో మాట్లాడారు. ఈ మేరకు కౌంటర్ వెయిట్ల వద్ద జరుగుతున్న పనులపై ఆరా తీశారు. డ్యాం భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని కన్నయ్యనాయుడు సీఎం సూచించినట్లు తెలుస్తోంది.
అనంతరం గేట్ల వద్ద అడ్డుపడిన బోట్లను పరిశీలించారు. రానున్న రెండు రోజుల్లో గేట్ల వద్ద చిక్కుకున్న బోట్లను తొలగిస్తామని, అయితే కొంత కష్టంతో కూడుకున్నది అని వివరించారు. ప్రకాశం బ్యారేజీ పటిష్టతకు నివేదిక ఇవ్వాలని సీఎం కోరారని తెలిపారు. అంతకుముందు కృష్ణానది ప్రవాహంపై ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. కౌంటర్ వెయిట్ల నిర్మాణంలో కృషి చేసిన వారిని సీఎం అభినందించారు.