ప్రతిపక్షం, వెబ్ డెస్క్: సీఎం జగన్ రేపు ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. బుధవారం ఉదయం 10.56గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను ఆరంభిస్తారు. ఇచ్ఛాపురం వరకు మొత్తం 21 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. సిద్ధం సభలు జరిగిన 4 ఎంపీ నియోజకవర్గాలు మినహా 21 చోట్ల యాత్ర చేపట్టనున్నారు.