ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు మరోసారి బ్రేకులు పడ్డాయి. ఉగాది పండుగ సందర్భంగా ఇవాళ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సీఎం జగన్ విరామం ఇచ్చారు. క్రోధినామ సంవత్సరం సందర్భంగా సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు.