CM Revanth’s key decision: కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. రేషన్, ఆరోగ్య, ఇతర సంక్షేమ పథకాలన్నింటినీ ఒకే కార్డు ద్వారా అందించాలని, ఈ కార్డులతో లబ్ధిదారులు ఎక్కడైనా రేషన్, ఆరోగ్య సేవలు పొందేలా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని చేసుకొని పైలెట్ ప్రాజెక్టు కింద ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించి కార్యాచరణ ప్రారంభించాలని సీఎం రేవంత్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారట.