Chess Olympiads Winner Met CM Revanth Reddy: చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణపతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి రూ.25 లక్షల చొప్పున ప్రోత్సాహకాలను ప్రకటించారు. దేశం తరఫున తొలిసారి స్వర్ణపతకాలు సాధించిన క్రీడాకారులు అర్జున్, ద్రోణవల్లి హారిక జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు సీఎం క్రీడాకారులను అభినందించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి ఉన్నారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా కూడా పోస్ట్ చేశారు. ‘ఇటీవల హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగిన 45వ ఫిడే పోటీల్లో చెస్ ఒలంపియాడ్ లో స్వర్ణపథకం సాధించిన తెలంగాణ క్రీడాకారులు అర్జున్ (హన్మకొండ), ద్రోణవల్లి హారిక (ఖమ్మం) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించడంతో పాటు చెరొక రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించినట్లు తెలిపారు.