ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: గుండెపోటుతో మరణించిన విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మహా ప్రస్థానంలో రాజీవ్ రతన్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఆయన వెంట మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు. కాగా నిన్న ఉదయం రాజీవ్ రతన్ గుండెపోటుకు గురై మరణించిన సంగతి తెలిసిందే.