ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఓ వైపు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూనే పక్క రాష్ట్రాల్లోని పార్టీ అభ్యర్థుల కోసం సీఎం రేవంత్ ప్రచారం చేస్తున్నారు. నేడు ఆయన కర్ణాటకలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గుర్మిట్కల్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రచారసభలో పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు సేడంలో ప్రియాంక గాంధీతో కలిసి ప్రచారసభలో పాల్గొంటారు.
ఇది ఇలా ఉంటే ఏపీలో జరగబోయే ఎన్నికలపై తెలంగాణ సీఎం రేవంత్ స్పందించారు. ‘దేశంలో ఎక్కడైనా ప్రస్తుత ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల ప్రతికూల వాతావరణం ఏర్పడింది. APలో మేం(కాంగ్రెస్) షర్మిల నాయకత్వంలో ఇన్నింగ్స్ ప్రారంభించాం. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకురావాలనేదే మా ప్రణాళిక. పార్టీకి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంపై మా దృష్టి ఉంది’ అని రేవంత్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.