Young India Skill University Board: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరఫున రూ. 100 కోట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో గురువారం సమావేశమయ్యారు. ఈ మేరకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కీలక అంశాలను పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఎవరికి తోచిన విధంగా వారు వివిధ రూపాలలో యూనివర్సిటీ నిర్వహణకు సహకారం అందించాలని కోరారు.
అనంతరం వర్సిటీ బోర్డు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మాట్లాడారు. తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న సీఎం ఆలోచన గొప్పదని కొనియాడారు. నైపుణ్యాలు పెంపొందించాలన్న సీఎం ఆలోచన గొప్పదని, రేవంత్ విజన్ ఉన్న నాయకుడిని ఆనంద్ మహీంద్ర ప్రశంసించారు. అంతకుముందు ఈ ఏడాది నుంచే స్కిల్ యూనివర్సిటీలో ప్రారంభించే పలు కోర్సుల వివరాలను పారిశ్రామికవేత్తలకు అధికారులు వివరించారు.