Trending Now

సోనీయా గాంధీతో సీఎం రేవంత్ భేటీ..

ప్రతిపక్షం, హైదరాబాద్ స్టేట్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు (జూన్ 2) కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని ముఖ్య అతిథిగా హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. మంగళ వారం ఢిల్లీకి వెళ్లిన అయాన్ 10 జనపథ్ లో సోనియా గాంధీ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్.. సోనియాను ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించారు. తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయినందునా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సోనియాతో అరగంటపాటు సమావేశమై పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే కార్యక్రమానికి ఆహ్వానించారు.

పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ప్రముఖ కవి అందెశ్రీ రచించిన తెలంగాణ అధికారిక గీతాన్ని సోనియా గాంధీ సమక్షంలో వేడుకల్లో ఆవిష్కరించనున్నట్లు సీఎం క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర గీతానికి కీరవాణి సంగీతం అందించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఉన్నప్పటికీ, తెచ్చిన క్రెడిట్‌ని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత తన ఖాతాలో వేసుకున్నారు. అలా దాదాపు 10 సంవత్సరాలు ఆయన రాష్ట్రాన్ని పాలించారు. రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీకి ప్రజలు తొలిసారి అధికారం కట్టబెట్టారు. దీంతో రాష్ట్ర దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ నిర్ణయించింది. కార్యక్రమాన్ని గ్రాండ్‌గా సక్సెస్‌ చేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు.

Spread the love

Related News

Latest News