Trending Now

కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలోకి

కంటోన్మెంట్ అభివృద్ధికి నాది పూచీ.. సీఎం రేవంత్

హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్ బ్యూరో: కంటోన్మెంట్ ప్రజలు హైదరాబాద్‌లో ద్వితీయ శ్రేణి పౌరులుగా బ్రతుకుతున్నారు.. రోడ్ల కోసం రోజూ ఆర్మీ అధికారులతో పంచాయితీ పెట్టుకునే పరిస్థితి..అలాంటి ఈ ప్రాంతం కోసం ఢిల్లీలో కొట్లాడి.. ఎలివేట్ కారిడార్ తీసుకొచ్చి వందరోజుల్లోనే శంకుస్థాపన చేసుకున్నాం.. కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో కలిపితే తప్ప ఈ ప్రాంత సమస్యలు తీరవనీ సీఎం తెలిపారు. కంటోన్మెంట్‌లో సోమవారం రాత్రి కార్నర్ మీటింగ్ లో సీఎం మాట్లాడుతూ.. రాబోయే పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది.. మీ సమస్యలు పరిష్కరిస్తుంది.. కంటోన్మెంట్‌లో శ్రీ గణేష్‌ను గెలిపించండి.. మీ సమస్యలు పరుష్కరించే బాధ్యత నాది.పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ, బీఆరెస్ ఇక్కడి ప్రజల సమస్యలు పరిష్కరించలేదుబీఆరెస్ చచ్చిన పాము.. అది రద్దైన వెయ్యి నోటు లాంటిది. బీఆరెస్ కు గతమే ఉంది.. కానీ భవిష్యత్ లేదు. కాంగ్రెస్ ఏమీ చేయలేదంటున్న కేటీఆర్.. నువ్ చీర కట్టుకుని బస్సు ఎక్కు. నిన్ను టికెట్ అడిగితే గ్యారంటీలను అమలు చేయనట్లు.. అడగకుంటే మేం గ్యారంటీలను అమలు చేసినట్లు. నువ్వు, నీ అయ్య దిగిపో అంటే దిగడానికి నేను అల్లాటప్పాగా రాలేదనీ సీఎం హెచ్చరించారు.

ఈటెల, కేసీఆర్ ఓకే తాను మొక్కలు..

ఈటెల సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నారు.. కేసీఆర్ వేల కోట్లు దోచుకున్నప్పుడు నువ్వే కదా ఆర్ధిక మంత్రి.. దొంగలకు సద్దులు మోసింది నువ్వు కాదా? కరోన సమయంలో కార్పొరేట్ కంపెనీల నిధులు సంతోష్ రావు దోచుకున్నప్పుడు.. నువ్వు ఆరోగ్య శాఖ మంత్రివి కాదా?మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది.బీజేపీ.. మెడపై వేలాడే కత్తిలాంటిది.కత్తి బంగారుదైనా మెడ కోసుకుంటామా?బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దవుతాయి.రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ గెలవాలి.కంటోన్మెంట్ లో గణేష్ ను గెలిపించండి.. సునీతమ్మను గెలిపించి పార్లమెంట్ కు పంపండి.తెలంగాణకు బీజేపీ ఇచ్చింది.. మోదీ తెచ్చింది ఏమీ లేదు.. గాడిద గుడ్డు తప్ప.. గణేష్ ను 20వేల ఓట్ల మెజార్టీతో.. సునీతక్కను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపినచ్చండి అని రేవంత్ కోరారు.

Spread the love

Related News

Latest News